: స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ అల్లుడిపై ఆరోపణల నిర్ధారణ


2013 ఐపీఎల్-6 సీజన్ లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో జస్టిస్ ముకుల్ ముగ్దల్ నేతృత్వంలోని కమిటీ ఈ రోజు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. మొత్తం 170 పేజీలతో ఈ నివేదికను అందజేసింది. స్పాట్ ఫిక్సింగ్ లో దోషి అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్, బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయినట్లు కమిటీ పేర్కొంది. ఐపీఎల్ మ్యాచులు, వాటికి సంబంధించిన రహస్య సమాచారంపై గురునాథ్ బెట్టింగ్ కట్టినట్లు వివరించింది. అంతేకాక బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రాపైన కొంత విచారణ జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కాగా, కమిటీ నివేదికను సుప్రీం మార్చి 7న పరిశీలించనుంది.

  • Loading...

More Telugu News