: మాకు వారం రోజులూ పండుగే... బస్వరాజు సారయ్య


'రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర అంటే మాకు వారం రోజులూ పండుగే' అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. జాతర విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘ఈ పండుగకు బంధువులు, స్నేహితులను పిలిచి జాతర ఘనంగా చేసుకుంటాం. గిరిజన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ తల్లులే మా ఇలవేల్పు. మా నాయిన వారి పేర్లను కలిపే నాకు సారయ్య అని పేరు పెట్టారు. ఆ దేవతల దయతోనే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. జాతరలో కోట్లాది మంది భక్తులు వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించినా.. గద్దెల వద్ద ఒక్క ఈగ కూడా కనిపించదు. అదీ సమ్మక్క-సారలమ్మల మహత్యం మహాత్య్మం’’

మేడారం జాతరకు ఇక నుంచి ప్రత్యేక ఏర్పాటు చేస్తామని సారయ్య చెప్పారు. ప్రతీ వారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు వీలుగా పూజారులు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. వారం వారం దర్శనాలకు వీలుగా.. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈసారి జాతరకు 100 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. అలాగే జాతర కోసం రహదారులను అభివృద్ధి చేశామని, ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News