: రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
రాజ్యసభలో సమైక్యాంధ్రకు మద్దతుగా సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో, మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వారు నిరసన వ్యక్తం చేశారు. వీరిలో కేవీపీ, సుజనా చౌదరి తదితరులను తమ స్థానాలకు వెళ్లాలని సభాపతి పదే పదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో సభాపతి సభను 2 గంటలకు వాయిదా వేశారు.