: ముగిసిన బీఏసీ సమావేశం.. ఈ నెల 13 వరకే సమావేశాలు
శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. శాసనసభ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. నిరాకరించిన ప్రభుత్వం ఈ నెల 13 వరకే సమావేశాలు జరుగుతాయని స్పష్టం చేసింది. అయితే, కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకయినా సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమండ్ చేయగా, చర్చించి నిర్ణయం చెబుతామని ప్రభుత్వం తెలిపింది. అటు ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని బీఏసీలో టీడీపీ కోరగా, కేవలం బడ్జెట్ పై చర్చించేందుకే సమావేశాలు పరిమితమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.