: కిరణ్ ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్ రావు


సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీఎంతో స్పీకర్ కుమ్మక్కయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ లకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. సీఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీలో తీవ్ర నిరసన తెలుపుతామని హరీష్ రావు హెచ్చరించారు. అలాగే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్యాయం అనడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News