: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. వాయిదా
పార్లమెంటు ఉభయసభలు ఇవాళ (సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఆరంభమైన కొద్దిసేపటికే తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో, ముందుగా పది నిమిషాల పాటు రాజ్యసభను ఛైర్మన్ హమీద్ అన్సారీ వాయిదా వేశారు. అటు లోక్ సభలోనూ అదే తీరు కనిపించడం, న్యాయం చేయాలంటూ సీమాంధ్ర నేతలు నినాదాలు చేశారు. చేసేది లేక స్పీకర్ మీరాకుమార్ లోక్ సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.