: ఎంపీ శివప్రసాద్ మరో కొత్త వేషం
టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈసారి మరో కొత్త వేషంలో దర్శనమిచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ప్రత్యేక వేషాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పాములు పట్టేవాడి వేషంలో ఆయన పార్లమెటు వద్ద నిరసన తెలిపారు. గతంలో బుడబుక్కలోడు, నారదుడు, కోయదొర ఇలా పలు వేషాలతో తన నిరసనను పదిమందికి తెలియజేయడంలో శివప్రసాద్ విజయం సాధించారు.