: బలనిరూపణకు కేంద్రప్రభుత్వం సిద్ధం: కమల్ నాధ్
డీఎంకే పార్టీ యూపీఏ2 నుంచి వైదొలిగినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీలేదని కేంద్రమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఆయన ఇవాళ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీఏ2 ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. శ్రీలంక సమస్య మీద పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయని, ఏకాభిప్రాయంకోసం యత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏ సమయంలోనైనా బలనిరూపణకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు.