: అవిశ్వాస తీర్మానానికి 70 మంది మద్దతుంది: రాయపాటి


పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం, అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే 70 మంది ఎంపీల మద్దతు ఉందని తెలిపారు. ఈ రోజు గుంటూరులో సమైక్య రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News