: వెంకయ్యనాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే యెన్నం గరంగరం
బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడిపై తెలంగాణ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో పొత్తు కోసమే వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వెనకడుగు వేయడం మంచి పరిణామం కాదని హితవు పలికారు. వెంకయ్యనాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా? లేక జాతీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారా? అనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కల ఫలిస్తున్న సమయంలో నోటి కాడి ముద్ద లాగేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిండు పాలకుండలో విషం చుక్క వేయరాదని కోరారు.