: చిదంబరం ఇంటి ముట్టడి ఉద్రిక్తం.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్


జీవోఎం సభ్యుడు, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నివాసాన్ని సీమాంధ్ర జేఏసీ, విద్యార్థులు ముట్టడించిన వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ఈ వ్యవహారంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. చిదంబరం తమకు దొరక్కుండా ఎంతకాలం దాక్కుంటాడని ప్రశ్నించారు. శివగంగలో దొంగగా గెలిచిన చిదంబరం ఓ దుర్మార్గుడు అంటూ విమర్శించారు. పెరియార్ పుట్టిన గడ్డ మీద చెడబుట్టాడంటూ నిప్పులు చెరిగారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే... ఇతర రాష్ట్రాల వారు కూడా ప్యాకేజీలు అడుగుతారని చిదంబరం అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో కూడా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ డ్రామాలాడుతున్నారని చెప్పారు. ప్రధాని, సోనియాలతో పాటు జీవోఎం సభ్యులందరి నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News