: చంద్రబాబు వల్లే తెలంగాణ వెనక్కి వెళ్తోంది: కవిత
కేంద్ర కేబినెట్ పోలవరానికి అనుమతివ్వడం చాలా బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. తెలంగాణ వెనక్కి వెళ్లడానికి చంద్రబాబు నాయుడే కారణమని తాము నమ్ముతున్నామని చెప్పారు. చంద్రబాబు, కిరణ్, జగన్ లు తెలంగాణకు అడ్డుపడకూడదని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కోసం వాటర్ బోర్డులను కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని... కేంద్ర మంత్రుల కంటే రాష్ట్ర ముఖ్యమంత్రులకే ఎక్కువ అధికారాలు ఉంటాయని చెప్పారు.