: రాష్ట్ర వినాశనానికి కారణం ఆ ముగ్గురే: జగన్
సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలే రాష్ట్ర వినాశనానికి కారణమని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. వైయస్ హయాంలో స్వర్ణ యుగాన్ని చూశామని... ఆయన మరణానంతరం రాజకీయాలు మరింతగా దిగజారాయని చెప్పారు. సమైక్య శంఖారావంలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం సభలో ఆయన ప్రసంగించారు. విభజన బిల్లు వచ్చినప్పుడే కిరణ్ రాజీనామా చేసుంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుని... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తిని ప్రధానిగా చేద్దామని తెలిపారు.