: భారత్ కొంప ముంచిన అంపైరింగ్ తప్పిదాలు


ఆక్లాండ్ లో భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో అంపైరింగ్ తప్పిదాలే టీంఇండియా కొంప ముంచాయి. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న అజింక్య రహానే 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి తప్పిదం జరిగింది. రహానే బ్యాట్ కు బంతి తగిలినప్పటికీ... అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అనంతరం, మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న తరుణంలో... భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయంలో థర్డ్ అంపైర్ మన కొంప ముంచాడు. వాగ్నర్ బౌలింగ్ లో ధోనీ హిట్ వికెట్ అయ్యాడు. అయితే ఆ బంతిని నోబాల్ గా భావించిన అంపైర్... థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. టీవీ రీప్లేలలో బౌలర్ వార్నర్ క్రీజ్ సైడ్ లైన్లను తాకినట్టు క్లియర్ గా కనిపించింది. కానీ, ఏమనుకున్నాడో ఏమో థర్డ్ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. ఈ ఉదంతం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే మాంచి దూకుడుమీద ఉన్న ధోనీ పెవిలియన్ చేరడంతో... కివీస్ విజయం లాంఛనమైంది.

  • Loading...

More Telugu News