: రెండున్నర కోట్లిస్తేనే చిందేస్తానన్న ముద్దుగుమ్మ


సినీ పరిశ్రమలో క్రేజ్ ఉండాలే కానీ, పిండుకున్నవారికి పిండుకున్నంత. ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది బాలీవుడ్ అందాలభామ సోనాక్షి సిన్హా. బోనీ కపూర్ నిర్మిస్తున్న 'తేవర్' సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం సోనాక్షిని సంప్రదించారు. "తప్పకుండా చేస్తా... కానీ రెండున్నర కోట్లు ఇస్తేనే" అంటూ సోనాక్షి వయ్యారాలు పోయిందట. మాస్ మసాలా పాటల్లో ఇరగదీసే సోనాక్షికి అంత మొత్తం ఇచ్చినా పర్వాలేదని భావించిన బోనీకపూర్ ఓకే చెప్పేశాడట. మహీష్ బాబు నటించిన 'ఒక్కడు' రీమేక్ సినిమానే 'తేవర్'. ఇంకో విషయం ఏమిటంటే... ఈ పాట కోసం సోనాక్షి ధరించిన కాస్ట్యూమ్స్ ఖరీదు ఏకంగా 75 లక్షల రూపాయలట!

  • Loading...

More Telugu News