: సెల్ ఫోన్లలో రైళ్ల సమాచారం
భాగ్యనగర వాసులు తమకు కావాల్సిన రైళ్ల రాకపోకల కచ్చితమైన సమాచారాన్ని ఇకపై సులువుగా మొబైల్ ఫోన్ల ద్వారానే తెలుసుకోవచ్చు. ఇందుకు వీలుగా హైలైట్స్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే ఒక అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని సోమవారం ప్రారంభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో దీన్ని డౌన్ లౌడ్ చేసుకున్న అనంతరం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రైళ్ల సమాచారం తెలుసుకోవచ్చు.
మనం రైల్వే స్టేషన్లలో వేచి ఉన్నప్పుడు.. అక్కడి డిస్ ప్లే బోర్డులపై ఏ రైలు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది? ఏ ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది? అన్న సమాచారం వస్తుండడాన్ని గమనించే ఉంటాం. అచ్చంగా అదే సమాచారం ఈ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్లలోనూ కనిపిస్తుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, సికింద్రాబాద్, కాచీగూడ, నాంపల్లి తదితర స్టేషన్లలోకి వచ్చే అన్ని రకాల రైళ్ల సమచారం దీనిలో లభ్యమవుతుంది.