: రెండింటికీ తానే కింగునంటున్న శ్రీనీ
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ లో పదవీ దాహం పరవళ్ళు తొక్కుతున్నట్టుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవి మాత్రం వదిలిపెట్టబోనంటున్నారు. రెండింటికీ న్యాయం చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. బీసీసీఐ, ఐసీసీలకు అధ్యక్షుడిగా వ్యవహరించడాన్ని అడ్డుకునే నిబంధనలేవీ లేవని స్పష్టీకరించారు.