: మా నాన్న కడసారి చూపులకు సాయం చేయరూ!: ప్రధాని, సోనియాకు ఓ బాలిక లేఖ


గుజరాత్ కు చెందిన భవిక (12) అనే బాలిక ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలకు ఓ లేఖ రాసింది. గత డిసెంబర్లో పాకిస్తాన్ జైల్లో మరణించిన తన తండ్రి భిఖా షియాల్ ను కడసారి చూసేందుకు వీలుగా తమ పాస్ పోర్టులు, వీసాలు త్వరగా మంజూరయ్యేందుకు సహకరించాలని ఆ చిన్నారి లేఖలో ప్రధాని, సోనియాలను వేడుకుంది. తన తండ్రి అంత్యక్రియలను భారత్ లోనే జరపాలన్నది తమ కోరిక అని, ఆయన దేహాన్ని తమకు అప్పగించాలని కూడా ఆమె లేఖలో కోరింది. భవిక తల్లి కూడా రెండేళ్ళ క్రితం మరణించగా ఆ బాలిక తన సోదరుడితో కలిసి బంధువుల వద్ద ఉంటోంది. గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా గరాల్ గ్రామానికి చెందిన బిఖా (35) ను పాక్ నేవీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడే ఆయన మరణించాడు.

  • Loading...

More Telugu News