: పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులదే: అశోక్ బాబు


హైదరాబాదు ఏపీఎన్జీవో భవన్ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు బిల్లును అడ్డుకోకపోతే సమైక్య ద్రోహులుగా మిగిలిపోతారని అశోక్ బాబు అన్నారు. ఈ నెల 12వ తేదీన జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రమంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోతే వారిని క్షమించేది లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News