: తెలంగాణపై తీర్మానానికి టీఆర్ఎస్ పట్టు... అసెంబ్లీ అరగంట వాయిదా
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాయిదా పడ్డ శాసనసభ సమావేశాలు మళ్లీ ఇవాళ ప్రారంభమయ్యాయి. సభ మొదలైన కొద్దిసేపటికే టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడం, ఇతర విపక్షాలు సైతం వాయిదా తీర్మానాలకు పట్టుపట్టడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేయాల్సి వచ్చింది.