: కోపంతో ఊగిపోయిన సల్మాన్ సోదరి?
నటుడు సల్మాన్ ఖాన్ లానే ఆయన సోదరి అర్పిత కూడా బాగా షార్ట్ టెంపర్ అని తెలుస్తోంది. ఇంతకీ ఎవరిమీద అర్పిత అంతగా కోపం వెళ్లగక్కిందని ఆలోచిస్తున్నారా? ఓ పెద్ద ఫర్నీచర్ దుకాణంపై! ఆ కోపంతో అప్పటికే పెద్ద సోఫా సెట్ కోసం ఇచ్చిన ఆర్డర్ ను కూడా రద్దు చేసింది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల సల్మాన్.. అబుదాబీలో ఒకరోజు జరిగిన సెలబ్రిటీ టీ20 మ్యాచ్ కు అర్పితను కూడా తీసుకెళ్లాడు. వెళ్లాక దుబాయ్ లో షాపింగ్ కు చిట్టి చెల్లిని తీసుకెళ్లాడు. అప్పుడే అర్పితకు ఓ సోఫా సెట్ నచ్చడంతో తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత వద్దని చెప్పింది. ఎందుకని అడిగితే.. ఆ షాప్ వాళ్లకు తమ కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదని, చాలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని చెప్పింది. డబ్బులు ముఖ్యం కాదని, కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాలని తన ట్విట్టర్ లో తెలిపింది.