: వైయస్సార్, తాను కలసి ఏ తప్పూ చేయలేదు: కేవీపీ
దివంగత ముఖ్యమంత్రి వైయస్ లో భాగమైన తాను... ఆయన చివరి కోరిక కోసం ప్రయత్నిస్తానని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. తాను, వైయస్ కలసి ఏ తప్పూ చేయలేదని అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని... కాంగ్రెస్ పార్టీ మనిషిగానే చనిపోతానని చెప్పారు. గాంధీభవన్ తనకు దేవాలయం వంటిదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లినా... భవిష్యత్తులో మళ్లీ పుంజుకుంటుందని అన్నారు.