: ఎగురుతున్న ఎయిర్ ఇండియా విమానంలో కొట్లాట


ఆకలి మంటతో రగిలిపోయిన ప్రయాణికులు టిఫిన్ కోసం నడుస్తున్న విమానంలోనే సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఎయిర్ ఇండియాకు చెందిన గయ-వారణాసి-ఢిల్లీ విమానంలో ఈ సంఘటన నిన్న చోటు చేసుకుంది. విమానం వారణాసి సమీపంలోని బాబత్ పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవగానే ప్రయాణికులంతా కిందికి దిగి నిరసన ప్రదర్శన తలపెట్టారు. తమ చార్జీలను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే, సమస్య పరిష్కారం అయిందని తర్వాత ఏయిర్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ కేపీ సింగ్ తెలిపారు.

50 మంది ప్రయాణికులతో విమానం గయ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. వారణాసి ద్వారా వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికి సిబ్బంది బిస్కట్లు, టీలను ప్రయాణికులకు అందించారు. కానీ, టిఫిన్ ఇవ్వాల్సి ఉంది. ఇదేంటని కొందరు ప్రయాణికులు నిలదీశారు. పైలట్ అగౌరవంగా వ్యవహరించాడు. దాంతో కొందరు లేచి కొట్టుకునేంత స్థాయిలో వాదనకు దిగారు. కోపంతో లోపల వస్తువులను కూడా ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News