: బీజేపీలో చేరనున్న 'జీ-24 గంటలు' శైలేష్ రెడ్డి!
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మంది జర్నలిస్టులు తమదైన ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మార్గంలో మరో సీనియర్ జర్నలిస్టు నడవడానికి సిద్ధమయ్యారు. 'ఈనాడు'లో తన కెరీర్ ను ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ, 'జీ-24గంటలు' వార్తా చానల్ ఇన్ ఛార్జిగా పనిచేసిన శైలేష్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రానికి సర్వసన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన శైలేష్ రెడ్డి... రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు సమాచారం.