: స్మార్ట్ ఫోన్ పోయిందా.. నిమిషాల్లో దాని పీక పిసికేయడమే పరిష్కారం..!
ఖరీదైన స్మార్ట్ ఫోన్. చోరుడు స్మార్ట్ గా కొట్టేశాడా? దాన్ని పట్టుకోలేకపోతే.. వెంటనే ఆ ఫోన్ పీక పిసికేయవచ్చు. దాంతో కాస్త మనశ్శాంతి అయినా దొరుకుతుది. ఇంతకీ పీక పిసకడం ఎలా? ఎలా అంటే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఒక స్విచ్ ఉంటుంది. ఫోన్ పోయిందని తెలియగానే.. దాన్ని నెట్ వర్క్ సాయంతో పనిచేయకుండా చేసేయవచ్చు. ఇందుకు వీలుగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల తయారీలో మార్పులు చేయాలని అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్లు కోరుతున్నారు. ఇందుకు వీలుగా చట్టాన్ని తీసుకురావాలని వారి ప్రయత్నం. స్మార్ట్ ఫోన్లు పెద్ద ఎత్తున చోరీ అవుతుండడంతో వాటికి అడ్డుకట్ట వేయడంతోపాటు, వినియోగదారుల సమాచారం భద్రత కోసం ఈ ఏర్పాటు అవసరమని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డొమొక్రాట్ లెనో చెప్పారు.