: తెలంగాణ బిల్లులో 7 నిర్దిష్ట ప్రతిపాదనలు చేశాం: జేపీ


హైదరాబాదులో ఇవాళ (శనివారం) లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో 7 నిర్దిష్ట ప్రతిపాదనలు చేశామని, వాటిలో బిల్లులో రెండే ఉన్నాయని జేపీ పేర్కొన్నారు. తాము సూచించిన మౌలిక ప్రతిపాదనలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవసరమైన చోట ఓడరేవుల నిర్మాణాలు, స్టీల్ ప్రాజెక్టులను నిర్మించాలని కోరామని ఆయన అన్నారు. అయితే, వాటిని పరిశీలిస్తామని మాత్రమే చెబుతున్నారని, వాటిని అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పారు.

పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని సూచించామని ఆయన తెలిపారు. భద్రాచలం ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే, అన్నింటికీ పరిష్కరిస్తామని మాటలు చెబుతున్నారు గాని.. వాటిని చేతల్లో చూపించడం లేదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి, ప్రాజెక్టుల భవితవ్యం గురించి బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News