: షారుక్ కోసం ఒంటి కాలి డ్యాన్స్!


నటుడు షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'లో ఒంటి కాలితో డ్యాన్స్ చేయబోతున్నాడు. ఈ డాన్స్ ను ప్రత్యేకంగా షారుక్ కోసం ఆ చిత్రం దర్శకురాలు ఫరాఖాన్ రూపొందించబోతుందట. కొన్ని రోజుల కిందట ముంబయిలోని ఓ హోటల్లో ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే షారుక్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకున్న నాలుగు రోజుల తర్వాత కోలుకుని మళ్లీ షూటింగులో పాల్గొన్నాడు. అయితే, బాద్షా సరిగా డాన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. దాంతో, చిత్రంలో నటులంతా పాల్గొనే ఓ పాటలో ఒక్క కాలితో చేసే డ్యాన్స్ కదలికలను ఖాన్ కోసం ఇవ్వనున్నట్లు ఫరా ట్విట్టర్లో తెలిపింది.

  • Loading...

More Telugu News