: సమైక్య రన్ కు ముఖ్యమంత్రిని ఆహ్వానించాం: ఏపీఎన్జీవో
రేపు సాయంత్రం విజయవాడలో ఏపీఎన్జీవోలు నిర్వహించే సమైక్య రన్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు ఏపీఎన్జీవో నేత విద్యాసాగర్ తెలిపారు. ఈ సమైక్య రన్ కు అధ్యక్షుడు అశోక్ బాబును ఆహ్వానించామని, తప్పకుండా ఆయన హాజరవుతారని చెప్పారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి రాజ్ విహార్ కూడలి వరకు ఏపీఎన్జీవోల ర్యాలీ, మానవహారం జరుగుతుందని వివరించారు.