: హైదరాబాద్ వర్శిటీ విద్యార్థులకు యునెస్కో అవార్డు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక యునెస్కో పురస్కారాన్ని సాధించారు. 'రేడియో ఉమన్ ఆఫ్ పటారా' అనే వీడియో వీరికి ఈ అవార్డును సాధించిపెట్టింది. ఎన్ సీ ఫైజల్, షాన్ సెబాస్టియన్, తేజస్వి దంతులూరి అనే విద్యార్థులు రూపొందించిన ఈ వీడియో యునెస్కో-సెమ్కా వీడియో కాంపిటీషన్ లో మూడోస్థానంలో నిలిచింది. మహిళా సాధికారత ప్రధాన అంశంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించారు. రామ్ వతి అనే మహిళ తన గ్రామంలో కమ్యూనిటీ రేడియోతో ఎలాంటి ఫలితాలను సాధించగలిగిందన్నది ఈ లఘు చిత్రం ఇతివృత్తం.