: అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ మంత్రి రాజీనామా
అత్యాచార ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్ వైద్య శాఖ మంత్రి షబ్బీర్ ఖాన్ రాజీనామా చేశారు. ఓ వైద్యురాలికి మత్తిచ్చి అత్యాచారానికి యత్నించినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ ఈ ఉదయం కోరింది. దాంతో, ఆయన పదవినుంచి వైదొలగారు. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఖాన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు బాధితురాలి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశించడంతో మంత్రిపై పోలీసు కేసు కూడా నమోదయింది.