: మీ అధినేత చంద్రబాబు కాళ్లే పట్టుకోండి: శోభా నాగిరెడ్డి
రాష్ట్రాన్ని విడగొట్టరాదంటూ రెండు రోజుల కిందట ఢిల్లీలో టీడీపీకి చెందిన నేత ఒకరు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కాళ్లు పట్టుకున్న ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. విభజన ఆపాలంటే సీమాంధ్ర టీడీపీ నేతలు తమ అధినేత అధినేత చంద్రబాబు కాళ్లు పట్టుకోవాలని సూచించారు. విభజనకు అనుకూలంగా గతంలో బాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంటులో టీడీపీ ఎంపీలు పగటి వేషాలు వేస్తున్నారని ప్రశ్నించారు.