: న్యూయార్క్ ఎయిర్ పోర్టు ఓ పేద దేశంలా ఉందట!
అగ్రరాజ్యం అమెరికా ఆధునికతకు పెట్టిందిపేరని మనం ఇప్పటిదాకా అనుకుంటున్న మాట. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ న్యూయార్క్ ఎయిర్ పోర్టు (లా గార్డియా) పై చేసిన వ్యాఖ్య ఈ విషయాన్ని తప్పని చెబుతోంది. ఆయనేమన్నారంటే.. న్యూయార్క్ ఎయిర్ పోర్టు ఓ తృతీయ ప్రపంచ దేశాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఎత్తిచూపారు. భారీ మార్పులు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఆసియాలోని హాంకాంగ్ ఎయిర్ పోర్టు ముందు న్యూయార్క్ ఎయిర్ పోర్టు దిగదుడుపే అని స్పష్టం చేశారు. కళ్ళకు గంతలు కట్టి ఓ వ్యక్తిని లా గార్డియా తీసుకెళితే ఏదో నిరుపేద దేశానికి తీసుకువచ్చారని ఠక్కున చెబుతాడని జో బిడెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. త్వరలోనే వందల కోట్ల నిధులతో లా గార్డియాను ఆధునీకరిస్తామని ఎయిర్ పోర్ట్ అథారిటీ వర్గాలు తెలిపాయి.