: నిరుత్సాహం లేదు.. ఎన్నిసార్లైనా పోరాడుతాం: పిటిషనర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన 9 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు భిన్న స్పందనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో తాము నిరుత్సాహానికి గురి కాలేదని, విభజనను ఆపేందుకు ఎన్నిసార్లైనా పోరాడతామని పిటిషనర్ అన్నారు. రాష్ట్రపతి వద్దకు వెళ్లినప్పడు కూడా మరోసారి పిటిషన్ వేస్తామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసిందే తప్ప డిస్మిస్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో పౌరసత్వం ముఖ్యమైనదని, ఆర్టికల్ 3 పై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వకపోవడం కొంత నిరుత్సాహానికి గురి చేసిందని మరో పిటిషనర్ స్పందించారు.