: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హైదరాబాద్ జీవధార: జేడీ శీలం
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హైదరాబాద్ జీవధార వంటిదని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 57 ఏళ్లుగా అందరం కలసి సమష్టిగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. వివిధ రంగాలు హైదరాబాద్ లోనే కొలువై ఉండడంతో, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్ వస్తారని అన్నారు. విభజన అంటూ భవిష్యత్ తరాల జీవితాలపై కొట్టకూడదని ఆయన సూచించారు. తెలంగాణ ఇచ్చే తీరు బాలేదని తాము అధిష్ఠానికి తెలిపామని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపామన్నారు. సీమాంధ్రుల సమస్యలు తెలుసుకునేందుకు అధిష్ఠానం కనీస ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు.