: కా(అ)మాత్యుడిని తప్పుకోవాలని ఆదేశించిన కాంగ్రెస్
వైద్యురాలికి మత్తిచ్చి అత్యాచారానికి యత్నించిన జమ్మూ కాశ్మీర్ మంత్రి షబీర్ ఖాన్ ను పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం కోరింది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ సర్కారులో.. కాంగ్రెస్ తరఫున షభీర్ ఖాన్ మంత్రిగా ఉన్నారు. షబీర్ ఖాను పదవి నుంచి తప్పుకోవాలని కోరినట్లు.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సైఫుద్దీన్ సోజ్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ వైద్యురాలు అధికారిక పని కోసం మంత్రిగారి వద్దకు వెళ్లినప్పుడు ఆయన టీ ఇచ్చి అత్యాచారం చేయబోయారని ఆమె ఆరోపించడంతో కోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.