: శాంతియుతంగా ధర్నా చేసేవారిపై లాఠీచార్జీనా..?: బాబు


వ్యాట్ ఎత్తివేయాలంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వస్త్ర వ్యాపారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. వారిని అరెస్టు చేయడం సబబు కాదన్నారు.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు, లాఠీచార్జి ఘటనపై స్పందించారు. వస్త్ర వ్యాపారుల సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు టీడీపీ మద్దతిస్తుందని బాబు హామీ ఇచ్చారు. అప్రజాస్వామికంగా వ్యవహరించడం మానుకొని వెంటనే వ్యాట్ ఎత్తివేయాలని బాబు సర్కారును కోరారు. 

  • Loading...

More Telugu News