: మీ వేలే ఒక రిమోట్!


ల్యాప్ టాప్.. స్మార్ట్ ఫోన్, ఆడియో సిస్టం ఏదైనా కానీయండి. దానికి బ్లూటూత్ ఆప్షన్ ఉండాలి. అప్పుడు మీరు వేలితో వాటిని ఆదేశించవచ్చు. కాకపోతే మీ వేలికి ఒక అంగుళీకము ధరించాలి. ఏడుగురు యువ ఇంజనీర్లు ఈ ఉంగరం సృష్టికర్తలు. అందరూ 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే. కొచ్చిన్ కు చెందిన ఆర్ హెచ్ ఎల్ విజన్ టెక్నాలజీస్ సంస్థ (ప్రారంభ కంపెనీ) తరఫున వీరు దీన్ని రూపొందించారు. ఇందుకు పట్టిన సమయం కేవలం ఎనిమిది నెలలు. ఈ కంపెనీ సీఈవో రోహిల్ దేవ్ వయసు 23 ఏళ్లే. ఒకేసారి మూడు పరికరాలకు ఉంగరం ఆదేశాలను జారీచేయగలదని రోహిల్ చెబుతున్నారు. ఈ ఉంగరాన్ని వేలికి ధరించడం వల్ల ఆదేశాల్లో కచ్చితత్వం కూడా ఉంటుదంటున్నారు. దీని ధర 110 డాలర్లు (సుమారు రూ. 7వేలు). ఈ ఉంగరం జనవరిలో లాస్ వేగాస్ లో జరిగిన టెక్ క్రంచ్ హార్డ్ వేర్ పోటీలో ఫైనల్ వరకు వచ్చింది.

  • Loading...

More Telugu News