: బీజేపీ నేత హత్యకు కుట్ర
మణిపూర్ లో బీజేపీ నేత హత్యకు పన్నిన కుట్ర భగ్నమైంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని సవోంబంగ్ గ్రామంలో రాత్రి 11:30 ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గ్రామస్థులు గమనించారు. వెంటనే అప్రమత్తమై వారిని నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఇద్దరు అనుమానితులు గ్రామస్థుల చేతికి చిక్కగా, మూడో వ్యక్తి తప్పించుకున్నాడు. అందులో ఒక వ్యక్తి మణిపూర్ రైఫిల్స్ కు చెందిన వ్యక్తి. బీజేపీ నేత హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వారు తెలిపారు. నిందితుల దగ్గర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా రేపు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ జరుగనుంది. దీంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.