: బాబు కళ్ళల్లో నీళ్ళు తిరిగిన వేళ...


'అమ్మకు అమ్మవై పుడితే తప్ప అమ్మ రుణం తీర్చుకోలేవు' అని ఎవరన్నా అభ్యుదయ కవి హితబోధ చేస్తే తీసిపారేయకండి! ఈ వాక్యం చాలు..  అమ్మ గొప్పదనమేంటో చెప్పడానికి, సృష్టిలో అత్యంత విలువైన పెన్నిధి అమ్మేనని చాటడానికి. పసిప్రాయంలో ఎవరికైనా అమ్మే అన్నీ. అది సామాన్యుడికైనా, అసామాన్యుడికైనా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడూ అందుకు మినహాయింపు కాదు.

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తల సమావేశంలో అమ్మ ప్రస్తావన రాగానే బాబు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గరికపాటి రామ్మోహనరావు మాట్లాడుతూ, 'బాబు ప్రస్తుతం పడుతున్న కష్టం వాళ్ళమ్మగారూ చూసుంటే, ఎంత బాధపడేదో ఆ మహాతల్లి' అని ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు.

బస్సులో కూర్చుని లేచే సమయంలో బాబు.. నడుంనొప్పితో 'అమ్మా' అంటూ బాధగా  పైకి లేచేవారని గరికిపాటి తెలిపారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ కార్యకర్తల్లో మౌనం రాజ్యమేలింది. అందరి హృదయాలు ఒక్కసారిగా బరువెక్కాయి. ఇంతలో బాబు జోక్యం చేసుకుని మళ్ళీ సభను రాజకీయాల వైపు మళ్ళించారు. 

  • Loading...

More Telugu News