: సీఎం రాజీనామా నాటకం: గాలి ముద్దుకృష్ణమ
విభజన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నాటకం ఆడుతున్నారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ ఆరోపించారు. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని సీఎంను కోరుతున్నానన్నారు. రాజీనామా చేసి సీఎం పదవి తెలంగాణ వారికి ఇచ్చేందుకు కిరణ్ చూస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి డ్రామా ఆర్టిస్ట్ గా తయ్యారయ్యారని, అందరికీ లీకులు ఇస్తూ సీఎం లీకువీరుడిగా తయారయ్యారని వ్యాఖ్యలు చేశారు. "రోడ్ మ్యాప్ అడిగినప్పుడే రాజీనామా చేయకుండా సీఎం ఇప్పుడెందుకు చేస్తున్నారు?" అని ముద్దుకృష్ణమ ప్రశ్నించారు.
అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముద్దుకృష్ణమ, రాష్ట్రం విడిపోవాలని కేసీఆర్, జగన్ కోరుకుంటున్నారని, విడిపోతేనే వారికి లాభమన్నారు. కాంగ్రెస్ దత్తపుత్రుడు, పెంపుడు కొడుకులయిన వారిద్దరూ విభజనవాదులేనన్నారు. అయితే, కష్టాల్లో ఉన్న ప్రజల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.