: రాష్ట్ర విభజన అంశంపై దాఖలైన 8 పిటిషన్లపై శుక్రవారం ‘సుప్రీం’ విచారణ


రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి దాఖలైన ఎనిమిది పిటిషన్లపై శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించనుంది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను ఒకే రోజు విచారించనున్నట్లు ‘సుప్రీం’ తెలిపింది. దాంతో రేపటి ‘సుప్రీం’ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో సభ్యులు అభిప్రాయాన్ని తెలిపినా.. చివరకు అసెంబ్లీలో అది తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం విభజన బిల్లు పార్లమెంటుకు చేరిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News