: ఇష్రత్ జహాన్ కేసులో మోడీ సన్నిహితుడికి ఊరట


గుజరాత్ లో సంచలనం సృష్టించిన ఇష్రత్ జహాన్ హత్య కేసులో సీఎం నరేంద్ర మోడీ సన్నిహితుడు మాజీ హోం మంత్రి అమిత్ షాకు ఊరట లభించింది. సీబీఐ తాజా చార్జిషీటులో ఆయన పేరును పేర్కొనలేదు. ఇక ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరక్టర్ రాజిందర్ కుమార్ తో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై హత్యా నేరం కింద అభియోగాలను మోపింది. వారిపై 120-బి (క్రిమినల్ కాన్ స్పైరసీ), హత్య, తప్పుడు నిర్ధారణ, నిజాలు తొక్కిపెట్టడం వంటి అభియోగాలను మోపారు. నిందితులకు ఆయుధాలు సమకూర్చారంటూ వీరిలో రాజిందర్ కుమార్ పై అదనంగా ఆయుధ చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేశారు. 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్ తో పాటు మరో ముగ్గురిని టెర్రరిస్టులుగా పేర్కొని ఎన్ కౌంటర్ చేశారు. అమాయకులను బూటకపు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.

  • Loading...

More Telugu News