: భారతదేశాన్ని దర్శించుకునేందుకు 180 దేశాల ప్రజలు రావచ్చు


భారతదేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోని 180 దేశాల ప్రజలు ఇండియాలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వీసా నిబంధనలను సరళతరం చేశారు. ఇందులో భాగంగా ‘విజిట్ ఆన్ అరైవల్’ సేవలను భారత్ మరింత విస్తరించింది. అయితే భద్రత కారణాల రీత్యా.. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక, ఇరాన్ దేశాలను ఈ జాబితాలో చేర్చలేదు.
గతంలో మాదిరిగా వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత.. వారాల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు. ఇక నుంచి పర్యాటకులు దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే వీసా వచ్చేటట్లు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో, భారత్ లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. అలాగే, భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకులతో ఇక్కడ విదేశీ కరెన్సీ నిల్వలు కూడా పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News