: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 'బుల్లి' తార


వ్యభిచార రొంపిలోకి పేద కుటుంబాల నుంచి వచ్చిన బాలికలే కాదు, సినీ-టీవీ పరిశ్రమకు చెందిన కళాకారులూ దిగుతున్నారు. కాసుల కో్సం కక్కుర్తే ప్రధాన కారణం. ఇటీవల కాలంలో ఎందరో తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉదంతాలు మీడియాలో ఎన్నో చూస్తున్నాం. తాజాగా, పుణేలో ఓ బుల్లితెర నటీమణి శరీరాన్ని అంగడి సరుకుగా మార్చుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పుణేలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు సదరు తారను ఆమె సహాయకుడు నీరజ్ బదానీని అరెస్టు చేశారు. ఆమె పేరు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన ఈ యువ నటీమణి ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో నివసిస్తోంది. ఇక బదానీది ఢిల్లీ కాగా, విటులను మేనేజ్ చేసే బాధ్యత అతగాడిదే. ఆమెతో గడపాలంటే ఒకటిన్నర లక్షల రూపాయలు చెల్లించుకోవాలట!

  • Loading...

More Telugu News