: రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నాం: రఘువీరారెడ్డి
సాధారణ ఎన్నికల సన్నాహక విధులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సదస్సును వాయిదా వేసుకోవాలని ఎన్నికల కమిషన్ లేఖ రాసిందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. అందుకే రెవెన్యూ సదస్సులను సాధారణ ఎన్నికల తర్వాతనే నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరా మీడియాతో మాట్లాడారు. సీఎం ధర్నాలు చేయవచ్చా? లేదా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన.. ‘‘ఆ విషయాన్ని పక్కన పెట్టండి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్ ధర్నా చేశారు. అంతెందుకు, మొన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ధర్నా చేశారు’’ అని ఆయన చెప్పారు.