: ఆర్ఎస్ఎస్ చీఫ్ పై ఆరోపణలు నిజం కావొచ్చు: షిండే


2007 సంఝౌతా ఎక్స్ ప్రెస్, హైదరాబాదు మక్కా మసీద్, అజ్మీర్ దర్గా పేలుళ్లలో ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) అధినేత మోహన్ భగవత్ ప్రమేయం ఉందంటూ స్వామి అసిమానంద చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణలు నిజమే కావొచ్చని విలేకరులు అడిగినప్పుడు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. కాగా, ఇప్పటికే ఈ పేలుళ్లలో అరెస్టయి, రిమాండులో ఉన్న అసిమానంద ఈ వ్యాఖ్యలు చేసినట్లు 'ద కారవాన్' అనే ఆంగ్ల పత్రిక 'ద బిలీవర్' పేరుతో అసిమానందపై ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఈ మేరకు నిన్న విడుదలయిన ఆ పత్రిక ఆర్టికల్లో ఆయన ఈ విషయాలు చెప్పినట్లు పేర్కొంది. దాంతో, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతల్లో కలకలం చెలరేగింది. ఆ పేలుళ్లలో భగవత్ కు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు.

  • Loading...

More Telugu News