: రాష్ట్రం విడిపోవాలన్నదే జగన్ ఆంతర్యం: జేసీ


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన వాది అంటూ పలువురు నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటే జగన్ కు ఒక్క ఓటు కూడా రాదని, అందుకే రాష్ట్రం విడిపోవాలని జగన్ కోరుకుంటున్నారని అన్నారు. జగన్ సమైక్యవాది కాదని, సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది అని ఆరోపించారు. సమైక్యవాదాన్ని వినిపించే ఎమ్మెల్యే ఆదాలకు వైఎస్సార్సీపీ హామీ ఇచ్చి తప్పుకొందని జేసీ అన్నారు.

  • Loading...

More Telugu News