: ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) వాయిదా తప్పదా?
రాష్ట్ర స్థాయి విద్యాశాఖాధికారులతో మంత్రి పార్థసారథి చర్చలు జరుపుతున్నారు. ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్)కు సహకరించాలని అధికారులను మంత్రి కోరారు. అందుకు ఉద్యోగ సంఘాలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు (ఏపీఎన్జీవోలు) సమ్మె చేపట్టిన విషయం విదితమే. టెట్ ను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దాంతో, ఎన్జీవోల సమ్మె విరమించిన తర్వాతే.. అంటే పార్లమెంటు సమావేశాల తర్వాతే టెట్ ను నిర్వహించాలని మంత్రి నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.