: ముగిసిన జీవోఎం సమావేశం
నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన పది ప్రతిపాదనల సవరణలపై చర్చించారు. అయితే, ఈ సాయంత్రం జరిగే కేంద్రమంత్రివర్గ సమావేశంలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం లేదని మంత్రుల బృందం తెలిపింది.