: ముఖ్యమంత్రికి మూడింది: ఏఐసీసీ వర్గాలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి మూడిందని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం గత కొంత కాలంగా గుర్రుగా ఉంది. సాక్షాత్తూ సీఎం దేశ రాజధానిలో దీక్ష చేపట్టాడంటే కాంగ్రెస్ పార్టీ చేతకానితనం అర్థం అవుతోందని విపక్షాలు కాంగ్రెస్ ని కడిగి పారేస్తుండడంతో, దీనికి కారణమైన సీఎంపై అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి.
ముఖ్యమంత్రి తీరుతో కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఇరకాటంలో పడింది. పార్టీ అధిష్ఠానాన్ని సీఎం ఎప్పటికప్పుడు ధిక్కరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి మీద ఏ చర్య తీసుకున్నా, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, రాజ్యసభ ఎన్నికల తరువాత సీఎంను తొలగించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.